జనగణన-2027: విశాఖ బీచ్ రోడ్డులో అవగాహన ర్యాలీ

జనగణన-2027లో భాగంగా 'స్వీయ గణన'పై అవగాహన కల్పించేందుకు విశాఖ బీచ్ రోడ్డులో ఆదివారం భారీ 5K ర్యాలీ జరిగింది. జిల్లా యంత్రాంగం, జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డీఆర్వో ఎం. విశ్వేశ్వర నాయుడు, అడిషనల్ కమిషనర్ రమణమూర్తి ప్రారంభించారు. డిజిటల్ పద్ధతిలో తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ వేలాది మంది యువత ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్