విశాఖపట్నంలో పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మంగళవారం జగదాంబ జంక్షన్‌లో ఏఆర్ ఎస్ఐ శ్రీరాములు ఆధ్వర్యంలో వాహనాలను ఆపి, పెండింగ్‌లో ఉన్న ఫైన్లను అక్కడికక్కడే వసూలు చేశారు. వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే, వాహనదారులు తమపై ఉన్న పెండింగ్ చలానాలను వెంటనే చెల్లించాలని పోలీసులు సూచించారు.