విశాఖ పోర్టులో రూ. 230 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

శనివారం, కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ విశాఖ పోర్ట్ అథారిటీ పరిధిలో రూ. 230 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలుగు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సాగరమాల కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, విశాఖ పోర్టు త్వరలోనే 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో లక్ష్యాన్ని అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో సముద్ర రంగం కీలకమని, ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా విశాఖ పోర్టు ప్రపంచంలోని టాప్ 100 పోర్టుల్లో స్థానం దక్కించుకోవడం గర్వకారణమని కొనియాడారు.

సంబంధిత పోస్ట్