విఎంఆర్డిఎ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి మొత్తం 6 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ స్వయంగా పాల్గొని అర్జీదారుల నుండి సమస్యలను స్వీకరించారు. బాధితుల సమస్యలను నిశితంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ దాట్ల కీర్తి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.