నీట్, జేఈఈ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించాలనుకునే విద్యార్థుల కోసం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఈ సంస్థ ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ 2025 పేరుతో ఒక పరీక్షను నిర్వహించనుంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు 100శాతం వరకు స్కాలర్‌షిప్ లభించడంతో పాటు, రూ. 250 కోట్ల విలువైన నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. సంస్థ స్టేట్ అకాడమిక్ హెడ్ ఆర్. వి. ఎస్. ఎన్. మూర్తి శుక్రవారం విశాఖలో పేర్కొన్నారు.