ఈ నెల 14, 15వ తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ మంగళవారం జేసీ కె. మయూర్ అశోక్ తో కలిసి పరిశీలించారు. వేదిక వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితులను గమనించిన ఆయన, గ్రౌండ్ లెవెలింగ్, జంగిల్ క్లియరెన్స్, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, పార్కింగ్ వసతి, ప్రవేశ ద్వారాలు, సుందరీకరణ, డ్రెయిన్ల నిర్వహణ తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించి తగిన సూచనలు చేశారు.