వారాంతపు లక్ష్యాలకు అనుగుణంగా ఎన్టీఆర్ కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరగాలని, మెరుగైన ఫలితాలు సాధించాలని సంబంధిత అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. 2026 మార్చి నాటికి అన్ని ఇళ్లూ పూర్తి కావాలని నిర్దేశించారు. రోజువారీ లక్ష్యాలు పెట్టుకొని పని చేసి, పురోగతి సాధించాలని సూచించారు. బుధవారం హౌసింగ్, స్పెషల్ ఆఫీసర్లు, ఇతర అధికారులతో ఆయన సమావేశమయ్యారు.