విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక అనుమతులను సింగిల్ విండో విధానంలో వేగంగా మంజూరు చేయాలని, ఆటోనగర్, నానో పార్క్‌లలో అభివృద్ధి పనులను ముమ్మరం చేయాలని సూచించారు. ఉద్యోగుల సౌకర్యార్థం ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని కూడా ఆయన తెలిపారు.