విశాఖ: కార్మిక మంత్రి ఆకస్మిక తనిఖీలు

విశాఖపట్నంలోని సాగర్ నగర్ ప్రాంతాల్లో ఎం. కె. వన్, బూరుగుపల్లి సాగర్ విల్లాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికులతో మాట్లాడి, యజమానులు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై ఆయన ఆరా తీశారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ వలవాల మల్లికార్జున రావు (బాబ్జీ), కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ రామారావు కూడా మంత్రితో పాటు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్