విశాఖ: ఏయూ ముగింపు వేడుకలకు భారీ ఏర్పాట్లు: కలెక్టర్‌

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఆదివారం రాత్రి వీసీ జి. పి. రాజశేఖర్‌తో కలిసి ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, తాగునీరు, పార్కింగ్, భద్రత, వీవీఐపీ సదుపాయాలు పూర్తి చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, వీవీఐపీల కోసం అంబులెన్సులు, భద్రతా ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ చర్యలు సిద్ధంగా ఉంచాలని, రైల్వే స్టేషన్, ఎయిర్‌పోర్ట్ వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్