విశాఖ: సిఐఐ భాగస్వామ్య సదస్సు ఏర్పాట్ల పరిశీలన

నవంబర్ 14, 15 తేదీలలో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు కోసం మౌలిక వసతుల ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని మేయర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్