గాజువాక‌: పారిశుధ్య సమస్యను పరిష్కరించాలి

గాజువాక స‌మీపంలోని లంకెలపాలెం జంక్షన్‌లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని లంకెలపాలెం వర్తకుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు, అధ్యక్షుడు తురుశాల నర్సింగరావు, ఈసీ మెంబర్ లక్కందాసు నరేష్‌లతో కూడిన బృందం సోమ‌వారం అగనంపూడి జోనల్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసింది. జంక్షన్ పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు తక్షణమే అదనపు సిబ్బందిని కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్