గాజువాక కణితి వంటిల్లు జంక్షన్ నుండి జగ్గు జంక్షన్ వరకు 1.3 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పరిశీలించారు. నిత్యం ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే వివరించగా, ఈ పనులకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, వెంటనే పనులు ప్రారంభిస్తామని కమిషనర్ తెలిపారు. విస్తరణ సమయంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.