విశాఖపట్నం జగదంబ జంక్షన్, బీచ్ రోడ్ ప్రాంతాల్లోని ఐదు హోటల్స్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్ ఇన్స్‌పెక్టర్ అప్పారావు తనిఖీలు నిర్వహించారు. వంటలో ఉపయోగించే ఆయిల్, చికెన్ వంటి పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఫుడ్లో నాణ్యతలేమి కనిపించినపుడు తక్షణమే ఫిర్యాదు చేయాలని కస్టమర్లను ఆయన కోరారు. తనిఖీలు కొనసాగుతున్నాయి.