మాడుగుల మండలంలో శుక్రవారం 178 స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేసినట్టు ఎండిఓ కే అప్పారావు తెలిపారు. ఉదయం నుంచి కొత్త పాత పెన్షన్లు పంపిణీ కార్యక్రమంచురుకుగా సాగిందన్నారు. పలు గ్రామాల్లో పర్యటించి పెన్షన్లు అందజేయడంతో పాటు కార్యక్రమాన్ని పర్యవేషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 11580 పెన్షన్లు ద్వారా ఐదు కోట్ల 17 లక్షల 60 వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్టు ఎండిఓ తెలిపారు.