మండల పరిషత్తులో వార్షిక తనిఖీ చేసిన డిప్యూటీ సీఈవో

విశాఖ డిప్యూటీ సీఈవో రాజకుమార్ బుధవారం మాడుగుల మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎండిఓ కే అప్పారావుతో కలిసి కార్యాలయ సిబ్బందితో సమావేశమై రికార్డులను తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న పనులు, వాటి పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాడుగులలో చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలను పరిశీలించి, తడి చెత్త, పొడి చెత్త విభజనపై సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్