దేవరాపల్లి మండలంలోని తెనుగుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను సిరి ఫౌండేషన్ సభ్యులు ఎస్. బాబూరావు, ఎల్వి నారాయణరావుల సహకారంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుల డిఎస్ఎస్వి ప్రసాద్ శుక్రవారం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలని కోరారు.