దేవరాపల్లి మండలం కలిగొట్ల గ్రామంలో మండల టిడిపి ప్రధాన కార్యదర్శి దొగ్గ దేముడు నాయుడు ఆధ్వర్యంలో అనిల్ నీరుకొండ ఆస్పత్రి సౌజన్యంతో గురువారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పి హెచ్ సి పాధ్యక్షులు రామ కొండలరావు మాస్టారు నేతృత్వంలో జరిగిన శిబిరంలో 105 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాళ్లు, గుండె జనరల్ సర్జన్ స్పెషలిస్టులు వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా పంపిణీ చేశారు.