నర్సీపట్నం;కేడి పేట ఎస్సైగా రుషికేశ్వరరావు బాధ్యతల స్వీకరణ

గొలుగొండ మండలం కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్‌కు ఎస్సైగా వి. రుషికేశ్వరరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అల్లూరి జిల్లా పోలీస్ కంట్రోల్ రూం ఎస్సైగా పని చేసిన ఆయన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన వై. తారకేశ్వర రావు నాతవరం ఎస్సైగా బదిలీ అయ్యారు. రెండు నెలలుగా ఎస్సై పదవి ఖాళీగా ఉండడంతో, అధికారులు ఎట్టకేలకు పోస్టును భర్తీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రుషికేశ్వరరావు మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్