8న విశాఖ‌కు ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు

ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సాగర్ నగర్ వద్ద విద్యుత్ శాఖ పరిధిలోని సీవోఈఈటీ భవనంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. సీఎం కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యకలాపాలు, విద్యుత్ సరఫరా నియంత్రణ చర్యలను పరిశీలించడంతో పాటు, స్టార్టప్ ఔత్సాహికులతో ముఖాముఖి కానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్, బోర్డు రూమ్ ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశీలనలో ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్, డీసీపీ మణికంఠ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్