విశాఖ రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీ

విశాఖలోని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లోని ప్లాట్‌ఫారాలు, వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సేవల నాణ్యత, రైళ్ల సమయపాలనపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) కె. రామారావుతో పాటు పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్