విశాఖ: 481 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల మంజూరు

విశాఖ జిల్లాలో అర్హులైన 481 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 571 దరఖాస్తులు రాగా, ప్రాథమికంగా 481 మందికి ఆమోదం లభించింది. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. సత్తిబాబు, సమాచార శాఖ ఉప సంచాలకులు కె. సదారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్