విశాఖలోని వాల్తేర్ డివిజన్ పరిధిలో డబుల్ లైన్ కమిషనింగ్ పనుల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. శిలిమ్లిగూడ–కరకవలస స్టేషన్ల మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కోసం, విశాఖపట్నం – కిరండూల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. మార్చి 5 నుంచి 14 వరకు విశాఖ నుంచి బయలుదేరే 58501 నంబర్ రైలు, మార్చి 5 నుంచి 15 వరకు కిరండూల్ నుంచి వచ్చే 58502 నంబర్ రైలు అందుబాటులో ఉండవు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సవరించుకోవాలని సూచించారు.