విశాఖ: జనావాసాల మధ్య వైన్ షాప్ పెట్టొద్దు: ఐద్వా

విశాఖలోని నరసింహనగర్ సెకండ్ లైన్‌లో జనావాసాలు, అపార్ట్మెంట్ల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయనున్నారనే సమాచారంతో స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఐద్వా, డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ నాయకులు వారికి మద్దతు తెలిపారు. లేడీస్ హాస్టల్, కాలేజ్ సమీపంలో ఉండటంతో మహిళలు, పిల్లల భద్రతకు భంగం కలుగుతుందని నాయకులు గురువారం తెలిపారు. ఇప్పటికే ఉన్న వైన్ షాప్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కొత్తది ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. అపార్ట్మెంట్ వాసులు ఎక్సైజ్ అధికారులకు మెమొరాండం ఇచ్చారని, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వైన్ షాప్ ఏర్పాటును అడ్డుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్