మంగళవారం, వాల్తేరు రైల్వే డివిజన్ డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, రాయగడ డివిజన్ డీఆర్‌ఎం అమితాబ్ సింఘాల్‌తో కలిసి రాయగడ డివిజనల్ కంట్రోల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆపరేషన్స్, ఇంజినీరింగ్, భద్రత, క్రూ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల పురోగతిని సమీక్షించి, సిబ్బందితో మాట్లాడారు. అంతకుముందు, విశాఖపట్నం–విజయనగరం మార్గంలో విండో ట్రైలింగ్ తనిఖీ నిర్వహించి, మౌలిక వసతులు, భద్రత, ప్రయాణికుల సౌకర్యాల పురోగతిని పరిశీలించారు. రైల్వే కార్యకలాపాలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.