ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమ విభాగాధిపతి, సహాయ సంచాలకులు పి. వి. రామగోపాల్ పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం నగరంలోని సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనను, ఆయన సతీమణిని పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. 35 ఏళ్ల పాటు ఆకాశవాణికి విశిష్ట సేవలందించిన రామగోపాల్ కార్యదీక్ష, చిత్తశుద్ధి ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ఆకాశవాణి అధికారులు, నిర్వహణాధికారులు, సీనియర్ అనౌన్సర్లు పాల్గొన్నారు.