విశాఖ స్టీల్ ప్లాంట్సీఎండీని తప్పించి విచారణ చేపట్టాలి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కన్వేయర్ బెల్ట్ తెగిపడిన ఘటనపై యాజమాన్యం తప్పిదమేనని ఆరోపిస్తూ ఏఐటీయూసీ యూనియన్ నేతలు సోమవారం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ సీఎండీని విధులకు దూరం పెట్టి, నిపుణులతో జాయింట్ విచారణ చేపట్టాలని ఏఐటీయూసీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుత రావు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్