విశాఖ: '1100 సేవలను వినియోగించుకోండి'

మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. సోమవారం విశాఖ కలెక్టరేట్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పీజీఆర్ఎస్ నిర్వహించనున్నట్లు ఆదివారం పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్ కు కాల్ చేయవచ్చన్నారు. నగర ప్రజలు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్