భారతీయ రైల్వేలో వాల్తేరు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 150 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి అరుదైన మైలురాయిని అధిగమించింది. విశాఖలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిఆర్‌ఎం లలిత్ బోహ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. వాల్తేరు డివిజన్ 'బ్లూ చిప్' డివిజన్‌గా గుర్తింపు పొందిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా 85.09 మిలియన్ టన్నుల లోడింగ్ జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది 334 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారని, త్వరలోనే ఏఐ ఆధారిత అనౌన్స్‌మెంట్ సిస్టమ్, మెడికల్ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.