ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం విశాఖలోని 19వ వార్డు పరిధిలోని పెదజలరిపేట అంగన్‌వాడీ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. వాసవ్య మహిళా మండలి, విప్రో కేర్ కుశాల్, ఐసీడీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తల్లిపాలు శిశువుకు ఎంత ముఖ్యమో వివరించారు.