గూడెంకొత్తవీధి గ్రామంలో విద్యుత్ స్తంభం వద్ద ఏర్పాటు చేసిన ఫ్యూజ్ బాక్స్ ప్రమాదకరంగా మారింది. వైర్లు చేతికి అందే ఎత్తులో ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిన్నపిల్లలు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి, ప్రమాదాలను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.