కూలిపోవడానికి సిద్ధంగా విద్యుత్తు స్తంభాలు

పాడేరు మండలం నీకాయిపాడు గ్రామంలో ఐదు ఇనుప విద్యుత్తు స్తంభాలు కూలిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. ఈ స్తంభాల వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించవచ్చని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై విద్యుత్తు సంస్థ అధికారులకు పలుమార్లు విన్నవించినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి ప్రమాదకర స్తంభాలను తొలగించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్