రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ శుక్రవారం పాడేరులో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి చేరుకుని, స్థానిక బిర్సాముండా భవనంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తలారిసింగిలోని ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా ఆసుపత్రిని సందర్శించి, అక్కడి సౌకర్యాలను పరిశీలిస్తారు. పర్యటన ముగిసిన తర్వాత మంత్రి రాజాం వెళ్తారని అధికారులు తెలిపారు.