వినతుల పరిష్కారానికి అధికారుల చొరవ చూపాలని జేసీ అభిషేక్ గౌడ అన్నారు. పాడేరు ఐటిడిఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం జె అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డిఆర్ఓ కె. పద్మలత సంయుక్తంగా వివిధ మండలాల నుండి వచ్చిన తాగునీటి, రహదారులు, సిసి రోడ్లు, డ్రైనేజీలు సమస్యలపై వినతులు స్వీకరించారు.