పాడేరులో తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఇతర అధికారులు కలిసి గోడప్రతిని విడుదల చేశారు. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, అవే మొదటి సహజ టీకా అని జేసీ సూచించారు.