పాడేరు ఘాట్‌లో రక్షణ గోడలు శిథిలం

పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఘాట్ రహదారిలో రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగింది. గిరిజన ప్రాంతాలకు కీలకమైన ఈ మార్గంలో అనేక మలుపుల వద్ద గోడలు బలహీనంగా మారి వాహనదారుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా తీర్చిదిద్దాల్సిన రహదారి ప్రస్తుతం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్