పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం సాయంత్రం పాయకరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, కేసు రికార్డులు, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించి, ఫిర్యాదుదారుల సమస్యలను, ముఖ్యంగా వృద్ధులు, నిరుపేదలు, మహిళల కేసులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్, సీసీటీవీ పనితీరును బలోపేతం చేయాలని, కేసు అప్‌డేట్స్‌ను రోజువారీగా పూర్తి చేసి, డేటా ఖచ్చితత్వాన్ని కాపాడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్