వేంపాడు సబ్ స్టేషన్ పరిధిలోని నెల్లిపూడి, డిఎల్‌పురం, గునుపూడి గ్రామాల్లో ఆగస్టు 1న (శుక్రవారం) ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు చెట్ల కొత (ట్రీ కటింగ్) పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ ప్రజలను కోరింది. తాత్కాలిక అసౌకర్యానికి చింతిస్తున్నామని, సహకరించగలరని ఈఈ రాజశేఖర్ పేర్కొన్నారు.