పాయకరావుపేట సీఐగా శంకర్రావు బాధ్యతలు

పాయకరావుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా ఎస్. శంకర్రావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన సీఐ అప్పన్నను విశాఖ వీఆర్కు బదిలీ చేయగా, ఆయన స్థానంలో శంకర్రావును అధికారులు నియమించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్