గ్రామంలోనే భూ సమస్యల పరిష్కారం

మాకవరపాలెం మండలంలోని శెట్టిపాలెంలో గురువారం నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ ‘ఒక నెల–ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను నెలరోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు చిన్నచిన్న సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామంలోనే పరిష్కారం కల్పించడమే దీని ఉద్దేశమని, అధికారులు నాలుగు విడతల్లో గ్రామాలను సందర్శించి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు.

సంబంధిత పోస్ట్