పాయకరావుపేట మండలంలోని ఎరువుల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించింది. దుకాణాల్లోని ఎరువుల స్టాక్‌ను, రికార్డులను తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను విక్రయించడం, బ్లాక్ మార్కెట్‌కు తరలించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.