అచ్యుతాపురం: అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారి విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్