పెందుర్తిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బంటాకాలనీలో ఏసీపీ పృథ్వీరాజ్, సీఐ సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు లేని 20 వాహనాలను సీజ్ చేశారు. బెల్ట్ షాప్ నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం తనిఖీలు చేస్తామని సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్