రంపచోడవరం ప్రజావాణిలో 111 అర్జీలు, కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి

రంపచోడవరం ఐటిడిఏలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 111 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జాతీయ రహదారి పరిహారం, రహదారులు, బస్సు సౌకర్యం, ఆశ్రమ పాఠశాల స్థాయి పెంపు వంటి వివిధ సమస్యలపై అర్జీలు అందాయి. జిల్లా ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు 6,359 అర్జీలు పరిష్కరించబడ్డాయని, 2,484 అర్జీలు ఆడిట్ చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ప్రశాంత్ కుమార్, ఆర్. డి. ఓ అంబేద్కర్, డి. ఎన్. వి. రమణ, రుక్మాండయ్య, మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్