గ్రీవెన్స్‌కు రాని అధికారులపై ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై విచారణకు శనివారం ఐటీడీఏ కార్యాలయానికి వచ్చిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి, మధ్యాహ్నం 12 గంటల వరకు అధికారులు హాజరుకాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ ఘటనపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను తీవ్రంగా స్పందిస్తూ, అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్