రాష్ట్ర ప్రభుత్వం శనివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బొడ్డు హేమంత్ చింతూరు ఉపవిభాగం కొత్త అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా నియమితులయ్యారు. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న పంకజ్ కుమార్ మీనా అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పదోన్నతితో బదిలీ అయ్యారు. ఆయన స్థానంలోనే హేమంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.