పుష్కరాలు–2027 ఏర్పాట్లపై చింతూరులో సమీక్షా సమావేశం

పుష్కరాలు–2027 నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ చింతూరు, ఏఎస్‌పీ చింతూరు సంయుక్తంగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పుష్కర ఘాట్‌ల మరమ్మతులు, కొత్త ఘాట్‌ల నిర్మాణం, ప్రధాన రహదారుల అభివృద్ధి, ఆలయాల పనులు, భక్తుల సౌకర్యార్థం టాయిలెట్ల నిర్మాణంపై చర్చించారు. పనుల కోసం శాఖల వారీగా అంచనా నివేదికలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఎస్‌పీ బి. హేమంత్, ఈఈ మురళి, డీఈఈ (పీఆర్), తహసీల్దార్, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్