దేవీపట్నంలో పులి సంచారం

దేవీపట్నం మండలం గంగంపాలెం, దండంగి ప్రాంతాల్లో 13 ఆవు దూడలను చంపిన పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజల భద్రత దృష్ట్యా, గండి పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గంలో పోతవరం వద్ద చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేశారు. ఆ ప్రాంతం వైపు ప్రజలు, వాహనాలు వెళ్లకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్