విశాఖ ఆర్టీసీలో 300 మంది సిబ్బందికి పదోన్నతులు

ఆదివారం, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు మాట్లాడుతూ, మేనేజింగ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రీజియన్‌లోని సుమారు 300 మంది సిబ్బందికి వివిధ కేటగిరీలలో పదోన్నతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 30 మందికి ప్రమోషన్లు మంజూరు చేయగా, మిగిలిన వారికి సోమవారం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది సర్వీసు రికార్డులను అధికారులు తనిఖీ చేసి సిద్ధం చేశారు. ఈ ప్రక్రియలో ఆర్ఎం అప్పలనాయుడుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లతో సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్