విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సంస్థలోని 100 శాతం వాటాలు ఉపసంహరించబడతాయని కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించిన కేబినెట్ నిర్ణయాన్ని మరోసారి స్పష్టంచేసింది. రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఉక్కుశాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ సమాధానం ఇచ్చారు.